Header Banner

ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?

  Sat May 24, 2025 19:43        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని కొనసాగిస్తున్న సర్కారు.. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15000 నగదు జమ చేయనుంది. ఇన్నాళ్లు 10వ తరగతి విద్యార్థులకే పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా అందించనున్నారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో సైతం మార్పులు తెచ్చారు. విద్యార్థులకు సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాస్మోటిక్ కిట్స్, నైట్ డ్రెస్ లను ప్రభుత్వం అందజేయనుంది. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రెండు కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలుగు యూనివర్సిటీని రాజమండ్రిలో.. అంబేద్కర్ యూనివర్సిటీని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయనున్నారు.
అంతే కాకుండా స్టడీ సెంటర్ల బాధ్యతలను బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం అప్పగించింది. శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో ఉన్న మూడు ప్రముఖ పీఠాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురానున్నారు.

ఇప్పటివరకు ఈ రెండు విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండగా.. ఉమ్మడి ఏపీ సమయంలో వాటికి అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా స్టడీ సెంటర్లు ఉండేవి. అయితే ఇటీవల వీటి సేవలు నిలిపివేయడంతో ఇప్పుడు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అనుమతులు రద్దయిన 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అనుమతులను తిరిగి పునరుద్ధరించింది. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో పాలిటెక్నిక్ విద్య కీలకంగా ఉండే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అలానే కొత్తగా ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయాల వలన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్య చేరువ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిధుల విడుదలపై దృష్టి సారిస్తామన్నారు. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు.

ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #NewUniversitiesAP #AndhraPradeshEducation #HigherEducation #APDevelopment #ChandrababuNaidu